ETV Bharat / state

సీఎల్పీ ఆధ్వర్యంలో ఆస్పత్రుల సందర్శన - ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించనున్న సీఎల్పీ

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాలని సీఎల్పీ నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి వచ్చే నెల అయిదో తేదీ వరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో సందర్శించనున్నారు. ఆస్పత్రుల వారిగా క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు ఈ సందర్శన కార్యక్రమాన్ని చేపట్టినట్లు భట్టి వివరించారు. సందర్శన అనంతరం ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.

batti vikramarka
batti vikramarka
author img

By

Published : Aug 25, 2020, 8:35 PM IST

Updated : Aug 26, 2020, 4:21 AM IST

బుధవారం నుంచి వచ్చే నెల అయిదో తేదీ వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాలని సీఎల్పీ నిర్ణయించింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్‌ బృందం ఈ సందర్శన కార్యక్రమంలో పాల్గొంటుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు భద్రాచలం ప్రాంతీయ ఆస్పత్రి నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం జిల్లాల వారీగా వచ్చే నెల 5వ తేదీ వరకు కొనసాగనుంది.

కరోనా విజృంభిస్తోన్న ఈ తరుణంలో అందుకు తగ్గట్లు అన్ని రకాల నిబంధనలు పాటిస్తూనే... ఈ సందర్శన కార్యక్రమం కొనసాగుతుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్యం, అక్కడ మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల వారీగా క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు ఈ సందర్శన కార్యక్రమాన్ని చేపట్టినట్లు భట్టి వివరించారు.

వచ్చే నెల అయిదో తేదీన హైదరాబాద్‌ నగరంలో సందర్శనతో కార్యక్రమం పూర్తవుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆస్పత్రుల వారీగా ఉన్న సమస్యలు... ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.

ఇవీ చూడండి: సెప్టెంబరు 1 నుంచి ప్రభుత్వ కళాశాలల్లో ఆన్‌లైన్ తరగతులు

Last Updated : Aug 26, 2020, 4:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.