భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ కుటుంబానికి సొంత ఊరు ఆదరణ కరవైంది. పొట్టకూటి కోసం పట్నం వెళ్లి బతుకీడుస్తున్న కుటుంబం... కరోనాతో లాక్డౌన్తో ఉపాధి కోల్పోయింది. ఈ క్రమంలో సొంతూరులోనే కూలో నాలో చేసుకుని కళో గంజో తిని బతుకుదామని కొండంత ఆశతో స్వగ్రామానికి వస్తే గ్రామస్థులు కాదు పొమ్మంటున్నారు. ఇల్లందు మండలం కొమరారం గ్రామానికి చెందిన వీరిని గ్రామంలోకి రావొద్దని గ్రామస్థులు హెచ్చరించారు.
దేవాలయమే ఆవాసం...
ఈ క్రమంలో ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న దేవాలయమే వారికి నివాసంగా మారింది. హైదరాబాద్ నుంచి వందల కిలోమీటర్లు నడకయాతనతో ఉన్న ఊరికి చేరుకున్న ఆ కుటుంబాన్ని అంతా కలిసి గెంటేశారని కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం దయనీయ పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రతినిధి లింగయ్య అందించిన కథనం.