భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గడం వల్ల అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు తగ్గడంతో.. గోదావరిలో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. గురువారం సాయంత్రం 46.6 అడుగుల వద్దకు చేరిన నీటి మట్టం ఇవాళ సాయంత్రానికి 42.9 అడుగులకు తగ్గింది. ప్రవాహం తగ్గడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు.
ధవళేశ్వరం వద్ద గోదావరి పరవళ్లు
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగడంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.75 అడుగులకు చేరింది. దీంతో ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఇదీ చూడండి: Godavari: భద్రాచలం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక