భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో సత్యనారాయణపురంలో విషాదం చోటుచేసుకుంది. ఒకటో వార్డులో నివాసముంటున్న తిరుపతిరావు, జ్యోతి దంపతులకు 20 నెలల కుమార్తె ఉంది. చిన్నారి ఈశ్వని ఇంట్లో ఆడుకుంటోంది. పాప ఆడుకుంటోంది కదా అని కుటుంబసభ్యులు తమతమ పనుల్లో నిమగ్నమయ్యారు.
ఆడుకునే క్రమంలో నీటి తొట్టె దగ్గరికి వెళ్లిన చిన్నారి... ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. నీటి తొట్టెలో పడడం కుటుంబసభ్యులు ఎవరు గమనించకపోయేసరికి చిన్నారి ప్రాణాలొదిలింది. కాసేపటి తర్వాత ఇళ్లంతా వెతికిన కుటుంబసభ్యులకు నీటి తొట్టెలో విగతజీవిగా ఈశ్వని కనిపించగా... ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి.