కరోనా వ్యాప్తిని నివారించాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని కౌన్సిలర్లు భావించారు. వైరస్ వ్యాప్తి నివారణకు పట్టణంలోని వీధుల్లో రసాయన ద్రావణాలు పిచికారీ చేశారు.
ప్రత్యేక అధికారులు వార్డుల్లో జరిపే పారిశుద్ధ్య పనులు పర్యవేక్షిస్తున్నారు. కౌన్సిలర్లు వార్డుల్లోని ప్రజలకు మాస్కులు అందజేసి, ఇంట్లో నుంచి బయటకు రాకూడదని సూచించారు.