ETV Bharat / state

'చర్ల ఎన్ కౌంటర్​పై దర్యాప్తును మూడు నెలల్లో పూర్తి చేయాలి' - Charla encounter case

చర్ల ఎన్​కౌంటర్​పై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. చర్ల ఎన్ కౌంటర్​పై దర్యాప్తును మూడు నెలల్లో పూర్తి చేయాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది.

ts high court
ts high court
author img

By

Published : Jan 3, 2022, 9:49 PM IST

చర్ల ఎన్ కౌంటర్​పై దర్యాప్తును మూడు నెలల్లో పూర్తి చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ, ఛత్తీస్​గడ్ సరిహద్దుల్లోని చర్ల మండలంలోని తొండపల్లి అటవీ ప్రాంతంలో 2018 మార్చి 2న జరిగిన ఎన్ కౌంటర్​లో 12 మంది మావోయిస్టులు మరణించారు. బూటకపు ఎన్ కౌంటర్​లో మావోయిస్టులను హత్య చేశారని.. పోలీసులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలంటూ 2018లో పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ సతీశ్​ చంద్రశర్మ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.

ఎన్ కౌంటర్​పై ఎఫ్​ఐఆర్ నమోదు చేయడంతో పాటు.. ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం జరిపించి వీడియో చిత్రీకరించారన్న పోలీసుల వివరణను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఎఫ్ఐఆర్​పై మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని పోలీసులను ఆదేశిస్తూ... పిల్​పై విచారణ ముగించింది.

ఇదీ చదవండి : 'మృతదేహాలకు మళ్లీ శవపరీక్ష నిర్వహించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.