భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈ నెల 6 నుంచి జరుగుతున్న వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నేటితో పరిసమాప్తం కానున్నాయి. ఆలయ అర్చకులు లక్ష్మణ సమేత సీతారాములను గోదావరి నది వద్ద గల పునర్వసు మండపం వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించారు. గోదావరి నదిలో సుదర్శన చక్రస్నానం కన్నుల పండువగా జరిపించారు.
నేటితో బ్రహ్మోత్సవాలు పూర్తయినందున రేపటి నుంచి నిత్య కల్యాణాలు యథాతథంగా ప్రారంభమవుతాయని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు.
ఇవీ చూడండి: జూన్‌లోనే చెరువులకు కాళేశ్వరం నీళ్లు