స్థానిక సంస్థ ఓట్ల లెక్కింపులో గులాబీ పార్టీ అధిక మెుత్తంలో స్థానాలను సాధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఎదురులేదని చాటి చెప్పింది. జిల్లాలో మెుత్తం 209 ఎంపీటీసీ స్థానాలుండగా, అధికార పార్టీ 115 స్థానాలను సాధించింది. 25 స్థానాలు సాధించిన కాంగ్రెస్ రెండో స్థానం దక్కించుకుంది. తెదేపా 11 స్థానాలు సాధించగా..భాజపా, తెజస, వామపక్షాలు ఖాతా తెరవలేదు. ఇతరులు 29 సీట్లను గెలుచుకుని మరోసారి పట్టు నిలుపుకున్నారు.
20 జడ్పీటీసీ స్థానాలకు 15 గెలుచుకున్న తెరాస పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. కాంగ్రెస్ మూడు స్థానాలు సాధించగా భాజపా, తెదేపా, తెజసకు శూన్య ఫలితాలే మిగిలాయి. వామపక్షాలు ఒకటి, ఇతరులు ఒక స్థానాంలో విజయం సాధించారు.
ఇవీ చూడండి : సీఎం దత్తత గ్రామంలో తెరాసకు చుక్కెదురు
# | తెరాస | కాంగ్రెస్ | తెదేపా | ఇతరులు | వామపక్షాలు | మొత్తం |
జడ్పీటీసీ | 15 | 3 | 0 | 1 | 1 | 20 |
ఎంపీటీసీ | 115 | 25 | 11 | 29 | 0 | 209 |
మండలాల వారిగా ఎంపీటీసీ వివరాలు
మండలం | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు | మొత్తం |
ఆళ్లపల్లి | 2 | 1 | 0 | 1 | 4 |
అన్నపురెడ్డి పల్లి | 3 | 3 | 0 | 0 | 6 |
అశ్వాపురం | 8 | 3 | 0 | 1 | 12 |
అశ్వారావుపేట | 11 | 3 | 0 | 3 | 17 |
చండ్రుగొండ | 5 | 2 | 0 | 1 | 8 |
చర్ల | 3 | 5 | 0 | 4 | 12 |
చుంచుపల్లి | 6 | 1 | 0 | 5 | 12 |
దమ్మపేట | 13 | 1 | 0 | 3 | 17 |
దుమ్ముగూడెం | 4 | 0 | 0 | 9 | 13 |
గుండాల | 0 | 1 | 0 | 4 | 5 |
జూలూరుపాడు | 7 | 2 | 0 | 1 | 10 |
కరకగూడెం | 4 | 0 | 0 | 0 | 4 |
లక్ష్మీదేవిపల్లి | 5 | 0 | 0 | 6 | 11 |
మణుగూరు | 6 | 1 | 0 | 4 | 11 |
ములకలపల్లి | 2 | 0 | 0 | 8 | 10 |
పాల్వంచ | 7 | 0 | 0 | 3 | 10 |
పినపాక | 7 | 0 | 0 | 2 | 9 |
సుజాతనగర్ | 3 | 2 | 0 | 3 | 8 |
టేకులపల్లి | 7 | 0 | 0 | 7 | 14 |
ఇల్లందు | 12 | 0 | 0 | 4 | 16 |