భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం భూములు ఇచ్చి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిర్వాసితులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సూచించారు. నిర్వాసితులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేగా కాంతారావును కలిసి తమ సమస్యలు విన్నవించారు. రెండు పంటలు పండే సాగు భూములను బీటీపీఎస్ నిర్మాణం కోసం ఇచ్చి ఉపాధిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాభిప్రాయ సేకరణ రోజు నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామని జెన్కో యాజమాన్యం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కేటీపీఎస్ మూసివేయడం వల్ల అక్కడ పనిచేసే ఉద్యోగులను బీటీపీఎస్కి బదిలీ చేశారని అన్నారు. మాకు న్యాయం చేయాలని నిరసన చేశారు. రేగా స్పందిస్తూ నిర్వాసితుల ఉద్యోగాల విషయంపై జెన్కో అధికారులతో మాట్లాడానని, అందరికీ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి : 'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'