తమకు వెంటనే వేతనాలు చెల్లించాలని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఎదుట నిర్మాణ కార్మికులు ఆందోళన నిర్వహించారు. లాక్డౌన్ దృష్ట్యా బీటీపీఎస్ కార్మికులకు 23 రోజుల నుంచి నివాస గృహాలకు పరిమితం కావటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అందజేసిన 12 కేజీల బియ్యం రూ.500 నగదు నిండు నిండుకున్నాయని కార్మికులు వాపోయారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు అధిక ధరలకు వ్యాపారులు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మణుగూరు సీఐ ఘటనా స్థలికి చేరుకుని కార్మికులకు నచ్చజెప్పి పంపించారు. 3 నుంచి 7 రోజుల్లో వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బీటీపీఎస్ నిర్మాణ పనులు మళ్ళీ ప్రారంభమైనందున కార్మికులు పనులు చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు.