ETV Bharat / state

రామమందిర నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తికావాలని పూజలు - ప్రధాని మోదీ పేరుమీద భాజపా నాయకుల పూజలు

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రధాని మోదీ పేరుమీద భాజపా నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తికావాలని పూజలు చేసినట్లు వారు తెలిపారు.

bjp leaders Worship at bhadrachalam to complete the Ram Mandir construction smoothly
రామమందిర నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తికావాలని పూజలు
author img

By

Published : Aug 5, 2020, 7:33 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిని భాజపా నాయకులు దర్శించుకున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణం నిర్విఘ్నంగా సాగాలని రామయ్యను వేడుకున్నట్లు భాజపా జిల్లా అధ్యక్షులు కోనేరు చిన్ని, భాజపా నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, నాయకురాలు ఉప్పల శారద పేర్కొన్నారు.

ప్రధాని మోదీ, కిషన్​ రెడ్డి పేరు మీద పూజలు నిర్వహించినట్లు తెలిపారు. బేడా మండపంలో జరిగిన హోమ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే గొప్ప రామ మందిర నిర్మాణం అయోధ్యలో ప్రారంభించడం శుభదాయకమని అన్నారు. దేశంలోనే కాకుండా ఇతర దేశాల నుంచి రామయ్యని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నట్లు తెలిపారు.

రామమందిర నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తికావాలని పూజలు

ఇదీ చూడండి : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.