ETV Bharat / state

ముక్కోటి ఏకాదశికి భద్రాద్రి ముస్తాబు - 23న సీతారాముల వైకుంఠ ద్వార దర్శనం - భద్రాద్రి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం

Bhadradri Vaikunta Ekadashi Utsavalu 2023: ఈ నెల 23న జరిగే ముక్కోటి ఏకాదాశి ఉత్సవాలకు భద్రాద్రి రాముయ్య సన్నిధి సర్వం సిద్ధమైంది. దేశంలోనే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రిలో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. భద్రాద్రిలో ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సుమారు 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు రావచ్చని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.

Mukkoti utsavalu celebrations in Bhadrachalam 2023
Bhadrachalam Mukkoti utsavalu 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2023, 2:47 PM IST

Bhadradri Vaikunta Ekadashi Utsavalu 2023 : ఈ నెల 23న జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భద్రాద్రి రాముయ్య సన్నిధి సర్వం సిద్ధమైంది. దేశంలోనే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రిలో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. డిసెంబర్ 23న తెల్లవారుజామున 5 గంటలకు శ్రీ వైకుంఠ ఏకాదశి రోజు సీతారాములు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాలను నేరుగా వీక్షించడానికి విశేష సంఖ్యలో కదిలి వచ్చే భక్తులకోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు - పరశురామ అవతారంలో రామయ్య దర్శనం

Bhadrachalam Mukkoti Utsavalu 2023 : భద్రాద్రి రామయ్య సన్నిధిలో డిసెంబర్ 13 నుంచి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జనవరి 2 వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో డిసెంబర్ 23 వరకు పగలుపత్తు ఉత్సవాలు,(పగటిపూట నిర్వహించే ఉత్సవాలు) డిసెంబర్ 23 నుంచి జనవరి 2 వరకు రాపత్తు ఉత్సవాలు(రాత్రిపూట నిర్వహించే ఉత్సవాలు) నిర్వహిస్తున్నారు.

శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో శ్రీ సీతారామచంద్ర స్వామి వారు రోజుకు ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దశావతారాల్లో చివరి రోజైన గురువారం రోజున శ్రీరామచంద్ర స్వామి వారు శ్రీకృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 22న పవిత్ర గోదావరి నదిలో సాయంత్రం నాలుగు గంటలకు సీతారాములకు హంస వాహనంపై తెప్పోత్సవం వేడుక నిర్వహిస్తారు. 23న తెల్లవారుజామున 5 గంటలకు శ్రీ వైకుంఠ ఏకాదశి రోజు సీతారాములు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు.

భద్రాద్రిలో ఘనంగా శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

Teppotsavam Utsavalu In Bhadrachalam 2023 : ముక్కోటి ఏకాదశి రోజు నిర్వహించే ఉత్తర ద్వార దర్శనం కోసం ఉత్తర ద్వారాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్తర ద్వారం ఎదురుగా భక్తులు ఉత్సవాన్ని వీక్షించడానికి 8 సెక్టార్లను సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణం మొత్తం చలువ పందిల్లు వేసి మామిడి తోరణాలు, పూలమాలలతో అలంకరించారు. సుమారు 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు రావచ్చని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వీఐపీల కోసం ప్రత్యేక సెక్టార్లు సిద్ధం చేస్తున్నారు. లడ్డు ప్రసాదాన్ని విక్రయించటం కోసం ప్రత్యేక కౌంటర్లను సిద్ధం చేస్తున్నారు. రేపు జరగబోయే తెప్పోత్సవ వేడుకలకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకను భక్తులు చూసేందుకు వీలుగా గోదావరి పరివాహాక ప్రాంతం మొత్తం శుభ్రంగా తయారు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ కాంతుల్లో భద్రాద్రి ఆలయం కొత్త అందాన్ని సంతరించుకుంది.

ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? - ఎలా పూజించాలి? - మీకు తెలుసా?

ముక్కోటి ఉత్సవాలకు ముస్తాబైన భద్రాద్రి - నేడు మత్స్యావతారంలో రామయ్య దర్శనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.