భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబయ్యగూడెం గ్రామంలోని 530 కుటుంబాలకు 25 కిలోల బియ్యం, వెయ్యి రూపాయల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రతి నిరుపేదకు బియ్యం అందించేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.
విపత్తు సమయంలో పేదలకు బియ్యం, నగదు రూపంలో సహకారం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రదాతలకు భద్రాద్రి రాముని ఆశీస్సులు కలగాలని ఆయన ఆకాంక్షించారు. లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: 'ఈ రెండు చిట్కాలతో కరోనా నుంచి రక్షణ!'