భద్రాద్రి రామాలయంలో ఈనెల 8 నుంచి భక్తులకు భద్రాద్రి రామయ్య పునః దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది మార్చి 20 నుంచి ఇప్పటి వరకు ఆలయం మూత పడింది. లాక్‌డౌన్ కాలంలో అర్చకులు నిరాడంబరంగా స్వామివారికి పూజలు నిర్వహించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నిబంధనల ప్రకారం.. తిరిగి స్వామి వారి ఆలయం తెరచుకోనుంది. ఆలయంలో గుంపులు గుంపులుగా భక్తుల సంచారం ఉండకూడదని ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఆలయాన్ని శానిటేషన్ చేయాలని ఈవో నరసింహులు అధికారులను ఆదేశించారు.
భక్తులకు సూచనలు
- దేవస్థానం పరిధిలో కాటేజీ సౌకర్యం లేదు.
- ఆలయ పరిసరాల్లో భక్తులు ఎక్కువ మంది గుమికూడి ఉండకూడదు.
- భౌతిక దూరం తప్పనిసరి.. మాస్కు విధిగా ధరించాలి.
- భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది.
ఇదీ చూడండి: పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?