భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రామయ్య తండ్రి రోజుకొక రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మూడవ రోజైన నేడు స్వామివారు వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
మేళతాళాలు, మంగళ వాద్యాల మధ్య ప్రధాన ఆలయం నుంచి బేడా మండపం వద్దకు వచ్చిన స్వామివారు ప్రత్యేక పూజలు అందుకున్నారు. మధ్యాహ్నం మహా నివేదన అనంతరం.. స్వామివారు తిరువీధుల్లో విహరించనున్నారు. వివిధ అవతారాల్లో దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు తరలివస్తున్నారు.
ఇవీ చూడండి: అనిశా వలలో ఈసారే ఎక్కువ అవినీతి తిమింగలాలు...!