లాక్డౌన్ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో నిబంధనలు ఉల్లంఘించిన పలు దుకాణాలపై మున్సిపల్ అధికారులు వేటు వేశారు. సామాజిక దూరం పాటించాలని.. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి మాత్రమే బయటకి రావాలని ప్రభుత్వం పదేపదే చెప్తున్నా వాటిని కొందరు వ్యాపారులు ఖాతరు చేయడం లేదు. ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరుపుతున్న దుకాణదారుల తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని రెండు దుకాణాలకు రూ. 1500 చొప్పున జరిమానాను కమిషనర్ శ్రీనివాసరెడ్డి విధించారు.
ఇవీచూడండి: ఒగ్గుకథ రూపంలో కరోనా అవగాహన