భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్ 2 సంవత్సరాల క్రితం జరిగిన నక్సల్స్ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపారు. అధికారులు, పోలీసుల నుంచి పూర్తి సమాచారం సేకరించి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.
ఇల్లందు నియోజక వర్గ పరిధిలోని టేకులపల్లి మండలం మల్లె మడుగు అటవీప్రాంతంలో 2018లో 8 మంది నక్సల్స్ ఎన్ కౌంటర్‌కు గురయ్యారు. దానిపై అదనపు కలెక్టర్ రహస్యంగా విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి :ఏలూరులో అంతుచిక్కని రోగం.. మరో 46 మందికి అస్వస్థత