భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ గుండాల మండలంలో పర్యటించారు. కరోనా నేపథ్యంలో గ్రామాలలో రాకపోకలను దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించారు. ముతాపురం, నరసాపురం గ్రామాల్లో చాలా కొవిడ్ కేసులు ఉన్నాయని.. సదుపాయాలు లేని వారిని ఈ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని సూచించారు.
సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు జిల్లా కలెక్టర్‌ని కలిసి పలు సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాళ్ల వాగు బ్రిడ్జికి నిధులు మంజూరు చేయాలన్న విజ్ఞప్తిపై కలెక్టర్ స్పందించారు. నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కన్నాయిగూడెం రహదారి బీటీ రోడ్డు మంజూరు చేయాలని.. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అదనపు వైద్యుడిని నియమించాలని పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కోరారు.
ఇదీ చదవండి: తెరాస, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా