ETV Bharat / state

ప్రతి విద్యార్థి హాజరయ్యేలా చూడాలి: కలెక్టర్‌ - కలెక్టర్ ఎంవీ రెడ్డి

సెప్టెంబర్​ ఒకటి నుంచి ఆన్​లైన్​ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్థులకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్​ ఎంవీ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్​ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన టెలీ కాన్ఫరెన్స్​లో అధికారులతో మాట్లాడారు.

Bhadradri kothagudem Collector Tele Conference
ప్రతి విద్యార్థి హాజరయ్యేలా చూడాలి: కలెక్టర్‌
author img

By

Published : Aug 29, 2020, 12:40 PM IST

రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్​ 1న ఆన్​లైన్​ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్థులకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్​ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన టెలీ కాన్ఫరెన్స్​ ద్వారా విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. ప్రతీ విద్యార్థి ఆన్​లైన్​ తరగతులకు హాజరయ్యేలా చూడాలని, తరగతులకు హాజరయ్యే విద్యార్థుల వివరాలతో మ్యాపింగ్​ చేయాలని, ప్రతిరోజు హాజరు శాతాన్ని తనకు పంపాలని కలెక్టర్ ఆదేశించారు.

సెప్టెంబరు 2న జరగనున్న ‘పాలీసెట్‌’ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం 8, భద్రాచలంలో 5 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య పరీక్ష జరుగుతుందని, ప్రతి పరీక్షా కేంద్రానికి ఓ అధికారిని, తహశీల్దార్లు, ఎస్సైలు, ఎంఈవోలను ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లుగా నియమించామన్నారు. పరీక్షా కేంద్రాల్లో కొవిడ్‌ నివారణ చర్యలు చేపట్టాలని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ అధికారులు బస్సులు నడపాలని కలెక్టర్‌ ఆదేశించారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.