మరుగున పడుతున్న నాటక కళలను వెలికితీసేందుకు భద్రాచలంలోని ఆర్టీసీ ఉద్యోగులు తమ వంతు కృషి చేస్తున్నారు. నాటకం ప్రాముఖ్యతను భవిష్యత్తు తరాలకు తెలిపేందుకు ఏటా తెలుగు నాటక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గత 17 ఏళ్లుగా భద్రాచలంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్ట్ పాకాల దుర్గాప్రసాద్ అధ్యక్షతన పట్టణ ప్రముఖులు సహాయంతో 'భద్రాద్రి కళాభారతి' పేరుతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం మొదలైన ఉత్సవాలు నాలుగు రోజులపాటు ప్రతిరోజు సాయంత్రం జరగనున్నాయి. ఈ వేదిక గత 17 ఏళ్లుగా అనేక మంది సినీ కళాకారులను పరిచయం చేసింది. ప్రస్తుత కాలంలో మనుషుల్లో తగ్గిపోతున్న అనురాగం, ఆప్యాయతలను గుర్తు చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
ఇవీ చూడండి: పంట బీమా వల్ల.. రైతుకేది ధీమా..?