భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోనూ సమ్మక్క సారలమ్మ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎదిరగుట్టల వద్ద ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జాతర తొలి రోజైన బుధవారం గుట్ట మీద నుంచి పూజారుల ఆధ్వర్యంలో గిరిజన పెద్దలు బ్బరాసి ప్రాంతానికి అమ్మవారిని తీసుకు వచ్చారు. అక్కడ సంప్రదాయంగా ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. అనంతరం ప్రధాన పూజారి సమ్మయ్య ఆధ్వర్యంలో అమ్మవారిని భక్త జన నీరాజనం నడుమ గద్దెకు తీసుకు వచ్చారు. ఈ వేడుకను తిలకించేందుకు జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
ఇదీ చదవండి:అవినీతికి అడ్డాగా హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్..!