ETV Bharat / state

భద్రాచలంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టు సానుభూతిపరులు అనే అనుమానంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

author img

By

Published : Jul 30, 2019, 3:26 PM IST

భద్రాచలంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రాజపేట కాలనీలో పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు ఆకస్మిక నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాలమేరకు భద్రాచలం ఎస్పీ రాజేష్ చంద్ర సమక్షంలో 80 మంది సిబ్బందితో ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఇళ్లు తిరిగి అనుమానితుల ఆధార్ కార్డులు పరిశీలించారు. అనంతరం ధ్రువీకరణ పత్రాలు లేని 6 ద్విచక్ర వాహనాలు 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు సానుభూతిపరులు అనే అనుమానంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

భద్రాచలంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

ఇదీ చూడండి :పాక్​లో 72 ఏళ్లకు హిందూ ఆలయంలో పూజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రాజపేట కాలనీలో పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు ఆకస్మిక నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాలమేరకు భద్రాచలం ఎస్పీ రాజేష్ చంద్ర సమక్షంలో 80 మంది సిబ్బందితో ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఇళ్లు తిరిగి అనుమానితుల ఆధార్ కార్డులు పరిశీలించారు. అనంతరం ధ్రువీకరణ పత్రాలు లేని 6 ద్విచక్ర వాహనాలు 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు సానుభూతిపరులు అనే అనుమానంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

భద్రాచలంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

ఇదీ చూడండి :పాక్​లో 72 ఏళ్లకు హిందూ ఆలయంలో పూజలు

Intro:నోట్. మరికొన్ని విజువల్స్ ఈటీవీ డెస్క్ వాట్సాప్ నంబర్ నుంచి తీసుకోగలరు.... () గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి గోదావరి నది పరవళ్ళు తొక్కుతోంది జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని మన్యం ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి దీంతో మన్యం లోని ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి


Body:ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలంలోని గోదావరి నది పరవళ్ళు తొక్కుతోంది రోజురోజుకు క్రమంగా గోదావరి వరద నీరు పెరుగుతూ వస్తోంది ఆదివారం మధ్యాహ్నం 15 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సోమవారం ఉదయానికి 22 అడుగులకు చేరుకుంది సోమవారం సాయంత్రానికి 24 అడుగులకు నీటి మట్టం పెరిగింది దీంతో గోదావరి నది వద్దగల స్నాన ఘట్టాలు వరద నీటిలో మునిగిపోయాయి నాలుగు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో పాటు వరద నీరు ఉదృతంగా పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఎగువ ప్రాంతమైన పేరూరు . చర్ల మండలంలోని తాలిపేరు జలాశయం తో పాటు దుమ్ముగూడెం మండలం లోని వాగులు వంకలు పొంగి పొర్లడంతో గోదావరి వరద నీరు పెరుగుతోంది


Conclusion:దీంతో పాటు జిల్లాలోని చర్ల మండలంలో నీ తాలి పేరు జలాశయానికి ఎగువ ప్రాంతమైన చత్తీస్స్గడ్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 15 గేట్లను వదిలి 40 వేల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు తాలిపేరు జలాశయం వద్ద వరద నీరు పెరుగుతూ తగ్గుతూ ఉండటం తో ఒక్కసారి 20 గేట్లు మరోసారి 15 గేట్లు వదులుతూ నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు దీంతోపాటు చర్ల మండలంలో వాగులు పొంగడంతో కుర్ణపల్లి నుంచి బద్దెనపల్లి చతిస్గడ్లోని కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి చర్ల మండలంలోని పైడి వాగు లోతేంట వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి దుమ్ము గూడెం మండలం లోని పర్ణశాల వద్ద గోదావరి ఉదృతి పెరిగింది దీంతో సీత వాగు పొంగి నార చీరల ప్రాంతం సీతమ్మ వారి పసుపు కుంకుమ రాళ్ల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది మండలంలోని గౌరారం కే లక్ష్మీపురం గ్రామాల మధ్య ఉన్న చిన్న గుబ్బలమంగి వాగు పొంగడంతో సుమారు ఏడు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి సున్నం బట్టి బై రాగులపాడు గ్రామాల మధ్య రహదారిపైకి వరద నీరు రావడంతో ఆ రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెరిగిన గోదావరి వరద ఉధృతికి భద్రాచలం వద్ద రెండవ వంతెన నిర్మాణం పనులు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతంలో ని వాగులు వంకలు పొంగిపొర్లడంతో పాటు జలాశయాల్లోకి భారీగా వరద నీరు రావడంతో భద్రాచలం వద్ద గోదావరి పెరిగే అవకాశం ఉందని సిడబ్ల్యూసి అధికారులు తెలిపారు దిగువ ప్రాంతం లోని శబరి నది పోటెత్తడం వల్ల గోదావరి వరద పెరగవచ్చని అని అధికారులు తెలుపుతున్నారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.