భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో పుష్పార్చన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసం చివరి శుక్రవారం కావడం వల్ల రామయ్య సన్నిధిలోని ఉపాలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీ తాయారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మ వారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. కల్యాణ మండపం ప్రాంగణానికి లక్ష్మీ తాయారు అమ్మవారికి తీసుకువచ్చి లక్ష్మణ సమేత సీతారాముల వద్ద వివిధ రకాల పుష్పాలతో అర్చన చేసి ధూప దీప నైవేథ్యాలు సమర్పించారు.
ఇదీ చూడండి: పువ్వులతో ట్రాఫిక్ పాఠాలు...