వైష్ణవ సంప్రదాయం ప్రకారం గురువారం శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారాముల ఆలయంలో లక్ష్మణ సమేత సీతారాములకు ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం స్వామికి మహా నివేదన సమర్పించారు. సాయంత్రం కృష్ణావతారంలో ఉన్న సత్యభామ సమేత కృష్ణుడిని ఉయ్యాలలో ఉంచి ఆలయ అర్చకులు లాలలు, జోలలు ఉత్సవాన్ని నిర్వహించారు.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఉత్సవాన్ని భక్తుల మధ్య కాకుండా స్వామి వారి అంతరాలయంలో ఏకాంతంగా నిర్వహించారు. వేద పండితులు, అర్చకుల మంతోచ్ఛారణలతో మంగళవాయిద్యాల నడుమ స్వామి వారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ ఉత్సవంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆలయం వద్ద ఉట్టి కొట్టే వేడుకను జరపనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండిః కొండగట్టు ఆలయం మూడురోజులు మూసివేత: ఈవో