భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు కోటి కృష్ణమాచార్యులు కరోనాతో మృతిచెందారు.
పది రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఫలితం పాజిటివ్ రావడం వల్ల చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. చికిత్స అనంతరం స్వస్థలం భద్రాచలానికి తీసుకువచ్చారు.
ఇవాళ మధ్యాహ్నం ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన 1958 నుంచి 2008 వరకు భద్రాద్రిలో విధులు నిర్వహించారు. 50 సంవత్సరాలు శ్రీరామనవమి కల్యాణోత్సవాల్లో పాల్గొన్నారు.
ఇవీచూడండి: అధైర్య పడకండి.. ప్రతిఒక్కరినీ ఆదుకుంటాం: మంత్రి కేటీఆర్