భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా రామయ్య రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు రామచంద్రుడు పరశురామావతారంలో దర్శనమిచ్చారు.
ఉత్సవమూర్తులను బేడా మండపం వద్దకు తీసుకువచ్చి... వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహానివేదన అనంతరం స్వామి వారిని మంగళ వాద్యాలు, సకల రాజలాంఛనాలతో చిత్రకూట మండపం వద్దకు తీసుకెళ్లారు. వేద పండితులు వేదమంత్రాలు పఠిస్తూ ఉండగా... అర్చకులు మంత్రోచ్ఛరణలు అధ్యయనం చేస్తుండగా... స్వామివారికి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. పరశురామావతారంలో ఉన్న స్వామి వారిని దర్శించుకోవడం వల్ల శుక్ర గ్రహ దోషాలు తొలిగి సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలుపుతున్నారు.
ఇదీ చూడండి: చెట్టును మించిన దైవం లేదు : వనజీవి రామయ్య