భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భద్రాద్రి రామయ్యని రోజుకొక అవతారంలో అలంకరిస్తున్నారు. రెండో రోజున రామయ్య కూర్మ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారికి ఆలయ అర్చకులు బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం మహా రాజభోగం అనంతరం స్వామి వారు చిత్రకూట మండపంలో దర్శనమివ్వనున్నారు.
పూర్వకాలంలో అమృతం కోసం దేవతలు, రాక్షసులు మందరగిరి పర్వతాన్ని చిలుకుతున్న క్రమంలో... పర్వతం సముద్రంలో మునిగిపోతున్న సమయంలో విష్ణుమూర్తి కూర్మావతారం ధరించి మునగకుండా ఆపారని పురాణాలు చెబుతున్నట్లు వైదిక సిబ్బంది పేర్కొన్నారు. ఈ అవతారంలో ఉన్న స్వామి వారిని దర్శించుకోవడం వల్ల శని గ్రహ బాధలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు.
ఇదీ చదవండి: రైతులకు మద్దతుగా సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర