ETV Bharat / state

సమస్యలకు నిలయంగా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి - ఖమ్మం తాజా వార్తలు

Bhadrachalam Government Hospital Many Problems: ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం తీరు సాధారణంగా దైన్యంగానే ఉంటుంది. ఎడారిలో ఒయాసిస్‌లా ఎక్కడో ఓ చోట ఆస్పత్రులున్నా అక్కడికి చేరుకోవాలంటే కొండలు ఎక్కాలి వాగులు దాటాలి. ఎన్నో కష్టాలకోర్చి వచ్చినా తీరా ఆసుపత్రిలో కావాల్సిన సదుపాయాలు.. డాక్టర్లు ఉంటారన్న నమ్మకం ఉండదు. ఈ లోగా ఊపిరి బిగపట్టుకుని ఉన్న ప్రాణం ఉంటుందో లేదో తెలియదు. ఇలాంటి దయనీయ పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి. ఏజెన్సీ ప్రాంతవాసుల ప్రాణాలు నిలిపేందుకు ఏర్పాటుచేసిన వైద్యులు లేక వెక్కిరిస్తోంది.

Bhadrachalam Government Hospital with many problems

author img

By

Published : Oct 12, 2022, 4:44 PM IST

సమస్యలకు నిలయంగా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి

Bhadrachalam Government Hospital Many Problems: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలకు భద్రత కరవైంది. ఏజెన్సీ ప్రాంతంలో 4 రాష్ట్రాల గిరిజన ప్రాంతవాసులకు అందుబాటులో ఉన్నఇక్కడ పరిస్థితులు దయనీయంగా మారాయి. 200 పడకలతో ఉన్న ఈ పెద్దాసుపత్రికి.. రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన ప్రాంతాల నుంచి నిత్యం వైద్యం కోసం వస్తుంటారు.

ఆయా రాష్ట్రాల్లోని ప్రధానంగా గిరిజన ప్రాంతాలకు చెందిన వారు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకు స్థోమత లేక భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు. కానీ ఇక్కడ వైద్యులు అందుబాటులో ఉండక.. కావాల్సిన సౌకర్యాలు లేకపోవటంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజన ప్రాంతాల నుంచి రోజూ అనేక మంది గర్భిణులు ఈ ఆసుపత్రికి వస్తుంటారు.

ఒకప్పుడు నెలకు 600లకు పైగా ప్రసవాలు: కానీ గర్భిణులకు ప్రసూతి వైద్య సేవలు అందించేందుకు ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేరు. ఆరు నెలలుగా ఒక్క వైద్యుడితో నెట్టుకురాగా పని ఒత్తిడి తట్టుకోలేక ఉన్న ఒక్క వైద్యుడు వెళ్లిపోవటంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఆరు నెలలుగా ఆసుపత్రిలో టెక్నీషియన్‌ లేక స్కానింగ్‌ విభాగాన్ని మూసివేశారు. ఒకప్పుడు నెలకు 600లకు పైగా ప్రసవాలు జరిగేవి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంఖ్య పదుల్లోకి చేరింది. రోజుకు ఒక ప్రసవం చేయడమే కష్టంగా మారినట్లు సిబ్బంది చెబుతున్నారు. గైనకాలజిస్ట్‌తో పాటు ఇతర వైద్యులు అందుబాటులో లేకపోవటంతో ఇక్కడి వచ్చే గర్భిణులను కొత్తగూడెం ఆసుపత్రికి తరలిస్తున్నారు. పురిటి నొప్పులతో వచ్చే వారి పరిస్థితి మాత్రం దారుణంగా మారింది. స్కానింగ్ విభాగం మూతబబడిన కారణంగా ప్రైవేట్ సెంటర్లలో వేల రూపాయలు వెచ్చిస్తూ పరీక్షలు చేయించుకుంటున్నారు.

వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఉపయోగం లేదు: ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం అత్యవసర పరిస్థితుల్లో స్థానికంగా అందుబాటులో ఉన్న వైద్యులకు డబ్బులు చెల్లించి వైద్యసేవలకు తీసుకువస్తున్నారు. కేవలం ప్రసూతి వైద్యులే కాదు ఇతర విభాగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఉపయోగం లేదని స్థానికులు చెబుతున్నారు.

నిరుపేద కుటుంబాల నుంచి వచ్చే గిరిజనులు వేల రూపాయలతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లటం తలకుమించిన భారమవుతోంది. ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి, భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, ఇతర సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

"ఈ ఆసుపత్రి 200 పడకలతో ఉంది. నాలుగు రాష్ట్రాల నుంచి రోగులు ఇక్కడికి వస్తారు. ప్రసవాలు బాగా జరుగుతాయి. అత్యవసర పరిస్థితుల్లో స్థానికంగా అందుబాటులో ఉన్న వైద్యులకు డబ్బులు చెల్లించి వైద్యసేవలకు తీసుకువస్తున్నాం. వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల సమీక్షలో కూడా మంత్రి హరీశ్​ రావు, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. వారు సానుకూలంగా స్పందించారు." - రామకృష్ణ, ఆసుపత్రి సూపరింటెండెంట్

ఇవీ చదవండి: ఆ కారణంతో.. నిమ్స్​లో నర్సుల విధులు బహిష్కరణ

'ఆమె' పేరుతో ప్రభుత్వం రోడ్డు నిర్మాణం.. పొట్టకూటి కోసం తల్లిదండ్రులే కూలీలుగా మారి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.