ETV Bharat / state

'లోక్ అదాలత్​ల ద్వారా కేసుల సత్వర పరిష్కారం'

ప్రతి చిన్న వివాదానికి న్యాయస్థానాలను ఆశ్రయించకుండా ప్రజలు లోక్ అదాలత్​ల ద్వారా తమ కేసులను పరిష్కరించుకోవాలని భద్రాచలం జ్యుడిషియల్​ ఫాస్ట్రాక్​ కోర్టు మెజిస్ట్రేట్ సురేష్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన లోక్ అదాలత్​లో పెద్ద సంఖ్యలో కేసులను పరిష్కరించామని ఆయన తెలిపారు.

lok adalat in bhadrachalam
భద్రాద్రి జిల్లాలో లోక్ అదాలత్
author img

By

Published : Apr 10, 2021, 3:29 PM IST

చిన్న చిన్న వివాదాలకు కోర్టుల చుట్టు తిరుగుతున్న కక్షిదారులు తమ కేసులను లోక్ అదాలత్​ల ద్వారా పరిష్కరించుకోవాలని భద్రాచలం జ్యుడిషియల్​ ఫాస్ట్రాక్​ కోర్టు మెజిస్ట్రేట్ సురేష్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్​లో 200 కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు.

లోక్ అదాలత్​ల ద్వారా ప్రజలు సత్వర న్యాయం లభిస్తుందని మెజిస్ట్రేట్ సురేష్ కుమార్ తెలిపారు. శనివారం నిర్వహించిన లోక్ అదాలత్​కు సూదూర ప్రాంతాల నుంచి వచ్చిన కక్షిదారుల కోసం త్రాగునీరు, పులిహోరను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం మండల లీగల్ సర్వీస్ ఛైర్మన్ సురేష్ కుమార్ కుమార్, ఏపీపీ సాంబ దుర్గబాయి, లోక్ అదాలత్ మెంబర్ పడిసిరి శ్రీనివాస్, బార్ అధ్యక్షులు ఎన్​ వీ ప్రసాద​రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కరోనా మృతుడికి అంబులెన్స్‌ సిబ్బంది అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.