ETV Bharat / state

మద్యం డబ్బులు ఇవ్వలేదని.. మందుబాబుని చితకబాదిన మహిళ

author img

By

Published : Jun 22, 2021, 7:01 PM IST

ఇద్దరు మందుబాబులు ఓ బెల్ట్​ షాపులో మద్యం కొనుగోలు చేసి... అక్కడే అతిగా సేవించారు. ఆ తరువాత డబ్బులు ఇవ్వమని దుకాణం యజమానురాలు అడగింది. వారిలో ఒకరు డబ్బులు ఇవ్వమని ... ఏం చేసుకుంటావో చేసుకో... అని అనడంతో... సదరు మహిళ తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఆ మందుబాబుని రోడ్డు పైకి లాక్కొచ్చి చితకబాదింది. దెబ్బలకు తాళలేక 'అక్కో నన్ను కొట్టొద్దు.. వదిలేయక్కా' అంటూ అతను బతిమాలినా ఆమె కోపం చల్లారలేదు. అతనిపై నీళ్లు పోసి మరీ కొట్టింది. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో జరిగింది.

belt shop women beat the drunker
మందుబాబుని చితకబాదిన మహిళ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో మందుబాబుని ఓ మహిళ చితకబాదింది. మండల పరిధిలోని సినిమా హాల్ సెంటర్​లో ఓ మహిళ బెల్ట్​ షాపు నిర్వహిస్తోంది. సారపాకకు చెందిన ఇద్దరు మందుబాబులు ఆమె దుకాణం వద్దకు వచ్చి మద్యం కొనుగోలు చేసి అక్కడే అతిగా సేవించారు. అనంతరం వారిద్దరూ గొడవపడ్డారు. అది గమనించిన దుకాణం యజమానురాలు వారిని గట్టిగా మందలించింది.

తీసుకున్న మద్యానికి డబ్బులిచ్చి వెళ్లిపోవాలని చెప్పింది. వారిద్దరిలో ఒక వ్యక్తి తాము డబ్బులు ఇవ్వమని ఆమె వాగ్వాదానికి దిగడంతో... వారి మధ్య కాసేపు పెద్ద గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన సదరు మహిళ... అప్పటికే బాగా మద్యం సేవించి ఉన్న వ్యక్తిని రోడ్డు మధ్యలోకి లాక్కొచ్చింది. స్థానికులంతా చూస్తుండగానే మందుబాబుని చితకబాదింది.

ఆమె బాదుడుకు తట్టుకోలేక ఆ మందుబాబులు కేకలు వేసినా ఆ మహిళ ఆగలేదు. 'అక్కో నన్ను వదిలేయ్' అంటూ... ఎంత బతిమాలినా ఆమె ఆగ్రహం మాత్రం చల్లారలేదు. మందుబాబుకు మత్తు దిగేందుకు అతనిపై నీళ్లు పోస్తూ మరీ చితక బాదుతుంటే... స్థానికులు ఆశ్చర్యపోయారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో... వారిని పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

మందుబాబుని చితకబాదిన మహిళ

ఇదీ చదవండి: KCR: వారానికి 2 గంటలు పనిచేస్తే వాసాలమర్రి అభివృద్ధి జరగదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.