ETV Bharat / state

Collector Anudeep Wife: ఆదర్శం... సర్కారీ దవాఖానాలో కలెక్టర్ సతీమణి ప్రసవం.. మంత్రి హరీశ్ ట్వీట్ - Collector Anudeep Wife Madhavi gives birth

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం అంటే చాలామంది భయపడుతుంటారు. చేతిలో డబ్బులు లేకున్నా సరే... తల్లీబిడ్డ క్షేమంగా ఉంటేచాలని చాలామంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తుంటారు. ఇటీవల కాలంలో సర్కార్ తీసుకున్న చర్యలతో కొందరు ప్రభుత్వ ఆస్పత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. మొన్న ఓ అడిషినల్ కలెక్టర్(Sneha latha mogili ias) కూడా సర్కార్ దవాఖానాలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈరోజు.. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్​ సతీమణి (Baradari kothagudem district Collector Anudeep Wife Madhavi ) ప్రసవం సైతం ప్రభుత్వాసుపత్రిలోనే జరిగింది. ఇలాంటి వాళ్లు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Collector Anudeep Wife Madhavi
సర్కార్ దవాఖానాలో కలెక్టర్‌ సతీమణి ప్రసవం
author img

By

Published : Nov 10, 2021, 9:04 AM IST

Updated : Nov 10, 2021, 4:27 PM IST

  • Warmest Congratulations to @Collector_BDD & his wife. I hope both the mother & the child are doing well. It gives us immense pride to see how under the able leadership of CM KCR Garu, state medical infrastructure has proven to be the first choice of people. https://t.co/H7jN2ldMZi

    — Harish Rao Thanneeru (@trsharish) November 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అధికారులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవడం చాలా అరుదు. అయితే ఓ ఉన్నతాధికారి భార్య ఏకంగా సర్కార్ దవాఖానాలో ప్రసవించి.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ అధికారి ఎవరో కాదు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్​ అనుదీప్‌ భార్య మాధవి. ఈ దంపతులకు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో పండంటి మగబిడ్డ జన్మించింది. మంగళవారం రాత్రి 1.19 నిమిషాలకు బిడ్డ పుట్టింది. ఆసుపత్రి వైద్యులు రామకృష్ణ, భార్గవి నేతృత్వంలో ఆసుపత్రి వైద్య బృందం విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో సురక్షితంగా ప్రసవం చేసిన వైద్యులను కలెక్టర్‌ అనుదీప్ అభినందించారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత నమ్మకం కలిగించేందుకు కలెక్టర్‌ చేసిన ప్రయత్నం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు. గతంలో ఇక్కడ ఐటీడీఏ పీవోగా చేసిన గౌతమ్‌ తన సతీమణిని ఇదే దవాఖానాలో పురుడు కోసం చేర్పించారు.

పేదలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు పొందాలని కలెక్టర్‌ దంపతులు సూచించారు. కలెక్టర్ దంపతులకు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తెరాస హయాంలో ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన సేవలు అందుతున్నాయని తెలిపారు.

అంతకు ముందు ఖమ్మం అదనపు కలెక్టర్​

ఆ మధ్య ప్రభుత్వఆసుపత్రిలోనే ఖమ్మం అదనపు కలెక్టర్‌ స్నేహలత ప్రసవం చేయించుకున్నారు. ఆమె భర్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏఎస్పీ శబరీశ్‌. ఈ దంపతులను రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అభినందించారు.

ఇదీ చూడండి: Sneha latha mogili ias: సర్కార్ దవాఖానాలో కలెక్టర్ ప్రసవం.. మంత్రి అభినందనలు

Last Updated : Nov 10, 2021, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.