భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లోని కోయ, గుత్తికోయ ప్రజలకు పోలీసులు వాటర్ ఫిల్టర్లు, దోమ తెరలను పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాలతో చర్ల పోలీసులు ఈ కార్యక్రమం నిర్వహించారు. చర్ల మండలంలోని పులిగుండాల, కొండవాయి వలస ఆదివాసీ, గొత్తి కోయ గ్రామాల్లో ఓఎస్డీ వి.తిరుపతి, భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ చేతుల మీదిగా వీటిని పంపిణీ చేశారు.
జిల్లా ఎస్పీ సునిల్ దత్ ఆదేశాలతో అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనుల ఆరోగ్యం పట్ల పోలీసు శాఖ ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతోన్నామని ఓఎస్డీ తిరుపతి అన్నారు. వర్ష కాలంలో వాగు నీటిని సేవించి, గుత్తి కోయ పిల్లలు,పెద్దలు, వృద్ధులు, మహిళలు అనారోగ్యం బారిన పడుతున్నారని అందుకే వాటర్ ఫీల్టర్లు అందించామని చెప్పారు.
ఇదీ చదవండి: చీఫ్ జస్టిస్ను కలిసిన సీఎం కేసీఆర్