కొత్తగూడెంలో పాఠశాల విద్యార్థులకు జిల్లా స్థాయి బాలోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్...వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన సాంస్కృతిక పోటీలు... మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో పోటీలు కొనసాగుతున్నాయి.
పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లోని విద్యార్థులు హాజరయ్యారు. పోటీలను ప్రారంభించిన చంద్రశేఖర్... విద్యార్థుల్లో కళా తృష్ణను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చక్కగా ఉపయోగపడతాయన్నారు. మరింత మెరుగైన నైపుణ్యాలను సాధించేందుకు ఇలాంటి పోటీలు అవకాశం కల్పిస్తాయని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : 'మటన్ పెట్టమని తల్లిని వేధించాడు.. ఆమె కొడుకును చంపేసింది'