నాణ్యత పెంచి బొగ్గు సరఫరా జరపాలని ఏపీజెన్కో సీఎండీ ఆంటోనీ రాజా సింగరేణి జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లకు సూచించారు. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లతో ఆంటోనీ రాజా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బొగ్గు నాణ్యత, అమ్మకం, ధర తదితర విషయాలను సమావేశంలో చర్చించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యవసర విధులు నిర్వహింపజేసి బొగ్గు ఉత్పత్తి చేసినప్పటికీ... కొనుగోళ్లు చేయకపోవటం వల్ల నిల్వలు పెరిగాయని జీఎంలు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పెంచి బొగ్గు రవాణా చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు ఇల్లందు ఏరియా జీఎం సత్యనారాయణ తెలిపారు.