ETV Bharat / state

అంగన్​వాడీ కార్యకర్త మృతి.. టీకాపై కుటుంబసభ్యుల అనుమానం - నందిపాడులో అంగన్​వాడీ కార్యకర్త మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నందిపాడులో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ అంగన్​వాడీ కార్యకర్త మృతి చెందింది. అయితే కొవిడ్ టీకా వేయడం వల్లనే చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

anganwadi teacher died with health issue in nadipadu village bhadradri kothagudem district
అంగన్​వాడీ కార్యకర్త మృతి
author img

By

Published : Feb 10, 2021, 4:26 PM IST

​ అనారోగ్యంతో అంగన్​వాడీ కార్యకర్త మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నందిపాడులో జరిగింది. అయితే ఆమె మృతికి కొవిడ్​ టీకానే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన నాగమణి(37) 20 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు.

జనవరి 21న మండలంలోని వినాయకపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా వేయించుకున్న వారిలో నాగమణి కూడా ఉన్నారు. ఆమెకు రక్తపోటు, చక్కెర వ్యాధి ఉన్నట్లు వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో అనారోగ్యానికి గురి కాగా ఈనెల 8న భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ కోలుకోలేక ఆమె మృతి చెందారు. అదే రోజు ఆమెతో పాటు టీకా వేయించుకున్న సున్నంబట్టికి చెందిన మరో అంగన్​వాడీ ఉపాధ్యాయురాలు సులోచన అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని మృతురాలి కుటుంబసభ్యులు వెల్లడించారు.

ఇదీ చూడండి : భారత ఫుట్​బాల్ మహిళా జట్టులో తెలుగమ్మాయికి స్థానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.