ETV Bharat / state

శతక కవి చిగురుమల్ల శ్రీనివాస్​ను కలిసిన అందెశ్రీ - telangana shithi

భద్రాద్రి శతక కవి చిగురుమల్ల శ్రీనివాస్​ను కలిసేందుకు తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ భద్రాచలంలోని చిగురుమల్ల స్వగృహానికి వెళ్లారు. భద్రాద్రి రచయితలు, కవులు అందెశ్రీని శాలువాలతో సన్మానించారు.

andheshree meet poet chigurumalla srinivas in bhadrachalam
శతక కవి చిగురుమల్ల శ్రీనివాస్​ను కలిసిన అందెశ్రీ
author img

By

Published : Sep 20, 2020, 7:12 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకు చెందిన శతక కవి చిగురుమల్ల శ్రీనివాస్​ను కలిసేందుకు తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ భద్రాచలంలోని చిగురు మల్ల స్వగృహానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆది శంకరాచార్యులు రచించిన సౌందర్య లహరి పుస్తకాన్ని చిగురుమల్లకు అందెశ్రీ అందజేశారు.

ఆచార్య పప్పు వేణుగోపాలరావు చేసిన వ్యాఖ్యానాన్ని భద్రాచలం రచయితలకు అందజేశారు. భద్రాచలం వచ్చిన ప్రముఖ కవి అందెశ్రీకి భద్రాద్రి రచయితలు, కవులు శాలువాలతో సన్మానం చేశారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి సాగిన ఈ సమావేశంలో తెలంగాణ సాహితి అధ్యక్షులు గోపాలకృష్ణ, గౌరవ అధ్యక్షులు మాలశ్రీ, గౌరవ సభ్యులు తులసీదాస్​ ప్రసాద్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి అష్టోత్తర శతఘటాభిషేకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.