రైతులు చలిలో దీక్షలు చేస్తున్నప్పటికీ వారి సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేస్తోన్న ఉద్యమానికి మద్దతుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అఖిలపక్ష నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పొదెం వీరయ్య హాజరయ్యారు. వివిధ పార్టీల నాయకులకు పూలమాలలు వేసి కండువాలు కప్పి దీక్షను ప్రారంభించారు. దీక్షలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: హైదరాబాద్ చేరుకున్న కొవిషీల్డ్ టీకా డోసులు