భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం గ్రామంలో జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్ పర్యటించారు. రైతు వేదిక, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డ్ నిర్మాణాల్ని, నర్సరీలను ఆయన పరిశీలించారు.
పలువురు ప్రజా ప్రతినిధులు మండలంలో నెలకొన్న పోడు భూముల సమస్యను అదనపు కలెక్టర్కు వివరించారు. అటవీశాఖ అధికారులు భూములలో ట్రెంచ్ (కందకం) పనులను చేస్తున్నారని స్థానిక ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ 2005 కంటే ముందున్న పోడు భూముల విషయంలో స్పష్టత ఉందన్నారు. 2005 తర్వాత నుంచి పోడు భూముల విషయంలో అటవీశాఖ అధికారులు వారి పరిధిమేరా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. స్థానికుల నుంచి పలు సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించిన ఆయన.. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: యాభై రూపాయల పంచాయితీ.. యువకుడు మృతి