భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణానికి చెందిన వంశీకృష్ణ గత రాత్రి ఇల్లందు నుంచి మోటార్ సైకిల్‌పై కొత్తగూడెం వెళ్తుండగా రోళ్లపాడు రహదారి వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టాడు.
దీనితో ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు తీవ్ర గాయాలు కాగా.. ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వంశీకృష్ణ మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి: 'మరో 80 ఏళ్లలో భారత్‌కు పెను ముప్పు