భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. సీనియర్ అకౌంటెంట్ వెంకటేశ్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ సైదులు అగ్రికల్చర్ విశ్రాంత ఉద్యోగి నారాయణ వద్ద నుంచి లక్షా 50వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
భద్రాచలంలోని చర్ల మండలంలో అగ్రికల్చర్ శాఖలో విధులు నిర్వహించి రిటైరైనట్లు నారాయణ తెలిపారు. తనకు రావలసిన సెటిల్మెంట్, పింఛను మొత్తం కోసం చాలా రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో లంచం ఇస్తే గాని పనిచేయమని చెప్పటం వల్ల బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వరంగల్ రేంజ్ డీఎస్పీ మధుసూదన్, ఇద్దరు సీఐలతో దాడులు నిర్వహించి ఇద్దరు ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఇవీ చూడండి: ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉంది: ఈటల