ETV Bharat / state

గరిట పట్టిన చేత్తోనే రెంచి పట్టింది.. ఆదర్శంగా నిలుస్తోంది.! - ఈటీవీ భారత్​ మానవీయ కథనాలు

అసలే పేదరికం. నిలువ నీడలేదు. భర్తకు సరైన ఉపాధి లేదు. అప్పు చేసి పెట్టుకున్న మెకానిక్ షెడ్డే ఆ కుటుంబానికి బతుకుదెరువు. భర్త కష్టాన్ని చూసిన ఆ ఇల్లాలు రెంచి పట్టింది. భర్తకు సాయం చేస్తూ కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తోంది. గరిట పట్టిన చేత్తోనే... రెంచి పట్టి పలువురికి ఆదర్శంగా నిలుస్తోన్న భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఆదిలక్ష్శి ప్రస్థానంపై కథనం.

గరిట పట్టిన చేత్తోనే రెంచి పట్టింది... ఎందరికో ఆదర్శమయ్యింది
గరిట పట్టిన చేత్తోనే రెంచి పట్టింది... ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది
author img

By

Published : Jan 19, 2021, 3:57 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం హైవేలో... అంజనాపురం గ్రామానికి రోడ్డు పక్కనే ఓ మెకానిక్ షాపు. అందులో లారీ టైర్లు మారుస్తూనో.. వెల్డింగ్​ చేస్తూనో.. గాలి పడుతూనే కనిపిస్తోందో మహిళ. ఆమే ఆదిలక్ష్మి. భద్రం-ఆదిలక్ష్మి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. నిరుపేదలైన వారికి నిలువ లేదు. ఉపాధి లేక రోడ్డున పడిన ఆ కుటుంబం కష్టేఫలి అన్నట్టుగా రెక్కల కష్టాన్ని నమ్ముకుంది. అప్పుచేసి ఓ మెకానిక్​ షెడ్​ ఏర్పాటు చేసుకున్నారు. భర్త రోజంతా కష్టపడినా కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మారకపోవడం వల్ల భర్త చేస్తున్న మెకానిక్​ వృత్తినే తాను నేర్చుకుంది ఆదిలక్ష్మి.

మొక్కవోని సంకల్పంతో..

సుజాతనగర్​సెంటర్​లో ఉన్న మెకానిక్ షెడ్డులోనే తాను ఉపాధి మార్గాన్ని వెతుక్కుంది. కొంతకాలం పాటు భర్త చేసే పనిని శ్రద్ధగా గమనించింది. అన్ని పనులు నేర్చుకుని... ఎప్పుడైనా భర్తకు ఆరోగ్యం బాలేనప్పుడు తానే రెంచి పట్టుకునేది. మొదట్లో ఇబ్బంది పడినా... మొక్కవోని సంకల్పంతో ముందుకెళ్లింది. గరిట తిప్పే చేత్తోనే రెంచి పట్టుకోవడం అలవాటు చేసుకుంది. 30 కేజీల బరువు ఉండే లారీ టైర్లను అలవోకగా మార్చేస్తోంది. పంక్చర్లు వేయడం, వెల్డింగ్, డ్రిల్లింగ్ పెట్టడం వంటి పనులు చకచకా చేసేస్తోంది.

ఇప్పుడదే జీవనాధారం

ఆదిలో భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకు నేర్చుకున్న పని... ఇప్పుడా కుటుంబానికి బతుకుదెరువుగా నిలుస్తోంది. ప్రధాన రహదారిలో వచ్చిపోయే వాహనాలతో ఇప్పుడు ఈ మెకానిక్ షెడ్డు బిజీబిజీగా ఉంటోంది. తమకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తే షెడ్డును మరింత అభివృద్ధి చేసుకుంటామంటున్నారు ఆ దంపతులు.

ప్రజాప్రతినిధిగానూ..

కుటుంబపోషణ కోసం మెకానిక్​ వృత్తిని ఎంచుకున్న ఆదిలక్ష్మి అంజనాపురానికే ఆదర్శంగా నిలుస్తోంది. అందుకే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు ప్రజలు ఆమెను తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. అటు ప్రజాసమస్యలు పరిష్కరించే నాయకురాలిగా... ఇటు కుటుంబ పోషణ కోసం మెకానిక్​ చేపట్టిన మహిళగా పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.

ఇదీ చూడండి: పాఠశాలల్లో జాగ్రత్తలు తీసుకోండి: మంత్రి సబిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.