ETV Bharat / state

నర్సుకు కరోనా పాజిటివ్.. గాంధీకి తరలింపు

author img

By

Published : Jun 6, 2020, 8:48 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు నెలల తర్వాత మరో కరోనా కేసు బయటపడింది. ఈ నేపథ్యంలో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో కరోనా కేసు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో కరోనా కేసు గుర్తించారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తోన్న 20 ఏళ్ల యువతి.. కరోనా బారిన పడింది. ఈనెల 4న హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్లే బస్సులో ఆ యువతి కొత్తగూడెం వరకు వచ్చింది. వైద్య పరీక్షల కోసం కొత్తగూడెం ఏరియా వైద్యశాలకు వెళ్లగా ఆమె రక్తనమూనాలను వరంగల్ ఆస్పత్రికి పంపారు. రక్త పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఫలితంగా బాధితురాలిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కుటుంబీకులు క్వారంటైన్​కు..

బాధిత యువతి తల్లిదండ్రులను, సోదరుడ్ని మణుగూరులోని క్వారంటైన్​కు తరలించారు. యువతి నివాస ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించి రాకపోకలను నిషేధించారు.

ఇవీ చూడండి : కేటీఆర్...​ మంత్రి పదవికి రాజీనామా చేయాలి: కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.