భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన మోతుకూరి మల్లికార్జునరావు చరవాణికి ట్రాఫిక్ అధికారుల నుంచి ఓ సందేశం వచ్చింది. తన ద్విచక్రవాహనం ఏపీ 12 ఎఫ్ 8371 పలుమార్లు హైదరాబాద్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను జరిమానా విధించినట్లు సందేశం వచ్చింది.
కొత్తగూడెంలో వాహనం... హైదరాబాద్లో చలానా..
రెండేళ్లుగా వాడకుండా మూలనపడేసిన తన పల్సర్ వాహనం 2019, 2020 డిసెంబర్ 11,21 తేదీల్లో హైదరాబాద్లోని పలు చోట్ల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను.. రూ.605 జరిమానా విధించారు. టేకుల పల్లిలో తన ఇంట్లో ఉన్న వాహనానికి హైదరాబాద్ నుంచి జరిమానా రావడం ఏంటని అవాక్కవడం తన వంతైంది. అయితే అదే నెంబరుతో హైదరాబాద్లో మరో వ్యక్తి తిరుగుతున్నట్లు ట్రాఫిక్ అధికారులు తీసిన చిత్రాలలో ఉంది. టేకులపల్లి గ్రామానికి చెందిన మూత రామాచారి వాహనానికి ఇల్లెందులో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్టు సందేశం రావడం వల్ల భయపడి జరిమానా కూడా చెల్లించాడు.
ఇదీ చూడండి: ఉద్యోగం రాలేదని.. ఊరికే ఉండిపోలేదు..