భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం ఇసుక వాగులో ఓ వ్యక్తి గల్లంతై... క్షేమంగా బయటపడ్డాడు. గొందిగూడెం గ్రామానికి చెందిన నరసింహారావు... శుక్రవారం అశ్వాపురం మండల కేంద్రానికి వెళ్లి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్న క్రమంలో ఇసుకవాగుపై నుంచి వెళ్లాడు. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇసుక వాదు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
వాగు ప్రవాహనానికి ద్విచక్రవాహనంతో పాటు నరసింహారావు సైతం నీటిలో కొట్టుకుపోయాడు. నరసింహారావుకి ఈత రావటం వల్ల తీవ్రంగా శ్రమించి అతికష్టంపై... క్షేమంగా ఒడ్డుకు చేరుకుని ఇంటికి వెళ్ళాడు. శనివారం ఉదయం వాగులో కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనాన్ని గుర్తించి స్థానికుల సాయంతో బయటకు తీశారు.