భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎస్సీ కాలనీకి చెందిన ఓ పోడు రైతు బలవన్మరణం చేసుకున్నాడు. మోదయ్య(55) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమకు ఐదు ఎకరాల భూమి ఉందని, దానిని అటవీశాఖ అధికారులు లాక్కోవడం వల్ల మనస్థాపానికి గురై ఆత్మహత్య పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పాల్వంచ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ పోడుభూములకు పట్టాలు ఇస్తామని రెండో విడత ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో పోడురైతులకు పట్టాలు అందకపోగా.. ఆ భూములను అటవీశాఖ అధికారులు లాక్కుంటున్నారనే ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాంతంలో చాలా మంది గిరిజనుల పరిస్థితి ఇలాగే ఉందని తెలిపారు.
ఇదీ చూడండి : ఆ హత్యలపై బయటి వ్యక్తుల ప్రమేయం ఉంది!