ETV Bharat / state

డంపింగ్ యార్డ్​లో పాతిక వేలు.. అక్కడికి ఎలా వెళ్లాయో తెలుసా..? - డంపింగ్ యార్డ్​ నగదు లభ్యం

భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు పట్టణంలోని ఓ నిరుపేద కుటుంబం సభ్యులు చెత్త కుప్పలో రూ. 25 వేలను పడేసుకున్నారు. అయితే ఆ డబ్బు మళ్లీ వారి వద్దకే చేరింది. అదెలాగో చూడండి.

డంపింగ్ యార్డ్​లో డబ్బులు
money_in dumping yard
author img

By

Published : Jun 22, 2021, 10:59 PM IST

చెత్త బండిలో చెత్త వేస్తారు.. ఇదీ అందరికి తెలిసిన విషయమే కాని ఓ చోట డబ్బులు కూడా చెత్తతో పాటు పారేశారు. వందో రెండు వందలో కాదు ఏకంగా 25 వేల రూపాయలు చెత్తలో పడేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో పొరపాటున చెత్త బండిలో వేసిన రూ. 25 వేలు తిరిగి బాధితులకు చేరాయి. ఏడో వార్డుకు చెందిన సర్దార్ కుటుంబ సభ్యులు.. ఉదయం చెత్త సేకరణ వాహనంలో నగదు ఉంచిన ఓ సంచిని చెత్తతో పాటు పడేశారు. సాయంత్రం డబ్బుల సంచి లేకపోవడంతో అసలు విషయం గుర్తించి.. స్థానిక వార్డు కౌన్సిలర్​ను ఆశ్రయించారు. కౌన్సిలర్.. పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి డంపింగ్ యార్డ్​లో గాలించారు.

ఓ పారిశుద్ధ్య కార్మికురాలికి దొరికిన డబ్బుల సంచిని చూసి.. బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాలకు కురుస్తోన్న ఇంటి రిపేర్ కోసం అప్పుగా తీసుకొచ్చిన డబ్బు తిరిగి లభించిందంటూ ఆనందభాష్పాలతో.. పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుకున్నారు.

ఇదీ చదవండి: Rape: ఏడాదిన్నర చిన్నారిని ఎత్తుకెళ్లి.. హత్యాచారం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.