భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. నిన్న పర్ణశాల పుణ్యక్షేత్రంలో తెప్పోత్సవానికి వచ్చిన శంకర్ గల్లంతయ్యాడు. నిన్నటి నుంచి మత్స్యకారులు గాలింపు చేపడుతుండగా... ఈ రోజు మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యులు పర్ణశాల ఆలయం ఎదుట మృతదేహంతో ఆందోళన చేస్తున్నారు. మృతదేహం లభ్యమవడం వల్ల అధికారులు పర్ణశాల ఆలయాన్ని మూసివేశారు.
ఇవీ చూడండి: హాజీపూర్ కేసులో మరికొద్దిసేపట్లో 'తుది' వాదనలు