భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో మహిళా స్త్రీ శిశు దివ్యాంగ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రజత్ కుమార్ సైనీ పాల్గొని వేడుకలను ప్రారంభించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.
వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు చూపరులను ఆకట్టుకున్నాయి. నేటి బాలలే రేపటి సమాజానికి మార్గదర్శకులని కలెక్టర్ రజత్ కుమార్ అన్నారు. అన్ని శాఖలు బాలల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని ఆయన సూచించారు.
ఇవీ చూడండి: సాహసయాత్ర... తండ్రి భయాన్ని ఆ కూతురు జయించేసింది!