ETV Bharat / state

'ఆ 5 గ్రామాలు తెలంగాణలో కలపాల్సిందే..' - ap people protest news

భద్రాద్రి జిల్లా ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్​లో ఉన్న తమ గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలంటూ ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఇరు రాష్ట్రాల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

people protest AP telangana border
ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద ఏపీ వాసుల ధర్నా.. అందుకోసమేనటా..!
author img

By

Published : Jul 24, 2022, 12:33 PM IST

Updated : Jul 24, 2022, 1:19 PM IST

'ఆ 5 గ్రామాలు తెలంగాణలో కలపాల్సిందే..'

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆంధ్రప్రదేశ్​-తెలంగాణ సరిహద్దు వద్ద 5 గ్రామాల ప్రజలు ధర్నాకు దిగారు. కన్నాయిగూడెం, పిచుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం, ఏటపాక గ్రామాల ప్రజలు.. భద్రాచలం శివారులో రోడ్డుపై వాహనాలు నిలిపివేసి ఆందోళన చేపట్టారు. ఏపీలో ఉన్న తమ 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలంటూ డిమాండ్​ చేశారు. ఆందోళనకారులకు కాంగ్రెస్​ ఎమ్మెల్యే పొదెం వీరయ్య సంఘీభావం తెలిపారు.

విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ పోలీసులు భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అక్కడే భారీగా మోహరించారు.

Last Updated : Jul 24, 2022, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.