ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొమ్మనపల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆ ప్రాంతంలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వారి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేశారు. అందులో సుమారు 20 కిలోల గంజాయి ఉన్నట్లు టేకులపల్లి సీఐ రాజు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని అన్నారు. వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనం, గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం... ఫోన్లలో అభ్యర్థుల ప్రసన్నం